ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ చేసిన రాహుల్.. రాజ్ అరెస్టు!
on Sep 1, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -503 లో....కావ్యని తీసుకొని రాజ్ పక్కకు వస్తాడు. ఏం చేస్తున్నావ్ అసలు కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావా.. కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి.. అప్పుడే ఉమ్మడి కుటుంబం బాగుంటుంది లేదా సాక్షాలతో నిరూపించాలి.. నాకు నీకన్నా నా కుటుంబం ముఖ్యం.. నీ కోసం నా కుటుంబం వదులుకోలేనని రాజ్ అనగానే.. నేను ఈ కుటుంబంలో మనిషినే నన్ను ఎందుకు వేరుగా చూస్తున్నారు. ఆ రుద్రాణి , రాహుల్ గురించి మీకు తెలియదా అంటూ కావ్య బాధపడుతుంది. నువ్వు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకని కావ్యకి చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కావ్య దగ్గరికి స్వప్న వచ్చి.. నా వల్ల నువ్వు మాటలు పడ్డావని అంటుంది. నిజంగా రాహుల్ ఫోన్ మాట్లాడ్డం.. నేను విన్నానని స్వప్న అంటుంది. నువ్వు అబద్దం చెప్పావ్ అనట్లేదు అక్క.. రాహుల్ , రుద్రాణిలు తెలివిగా నన్ను ఇరికించారని కావ్య అంటుంది. ఆ తర్వాత శృతికి కావ్య ఫోన్ చేసి రాహుల్ గురించి మొత్తం చెప్పి అతనిపై ఓ కన్ను వేసి ఉంచమంటుంది. స్వప్న రెడీ అయి వచ్చి హాస్పిటల్ కి వెళదామని కావ్యతో అనగానే.. సరేనని కాసేపటికి ఇద్దరు హాస్పటల్ కి బయలుదేర్తారు. మరొకవైపు ఇల్లీగల్ గోల్డ్ కి సంబంధించిన ఒకతను రాహుల్ దగ్గరికి వస్తాడు. వాటికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ శృతి తీసుకొని వచ్చి రాహుల్ కి ఇస్తుంది. ఆ తర్వాత శృతిని అక్కడ నుండి వెళ్ళమని రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎంతకాలం ఈ కంపెనీకీ ఎండీగా ఉంటానో తెలియదు.. అందుకే ఇప్పుడే డబ్బులు సంపాదించుకొని కూడా బెట్టుకోవాలని అంటాడు. మనం చేస్తుంది ఇల్లీగల్ అయినప్పుడు.. అగ్రిమెంట్ ఎందుకని అతను అనగానే.. ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ మనకి రాకుండా రాజ్ కి వచ్చేలా అని రాహుల్ అంటాడు. ఆ తర్వాత కావ్య, స్వప్న హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వస్తుంటారు. దారిలో కార్ ట్రబుల్ ఇస్తుంది. దాంతో ఆటో ఎక్కి వెళ్ళాలి అనుకొని ఆటో దగ్గరికి వస్తారు. ఆటో వెనకాల రేపటి కోసం అని ఉండడం చూసి.. ఇతనెవరో మన కళ్యణ్ లాంటి కవి అని స్వప్న అంటుంది. ఆటో డ్రైవర్ కళ్యాణ్ వాళ్ళని అద్దంలో నుండి చూసి షాక్ అవుతాడు. వాళ్లకి తెలియకుండా కర్చీఫ్ కట్టుకుంటాడు.
ఆ తర్వాత ఆటోలో వెళ్తుంటారు. అంతా కళ్యాణ్ వల్లే తనే ఉండి ఉంటే.. మా అయనకి ఆఫీస్ బాధ్యతలు అప్పజేప్పేవారే కాదని స్వప్న అంటుంది. మంచిగా వెళ్ళు అంటూ కళ్యాణ్ ని స్వప్న తిడుతుంది. ఆ తర్వాత ఇంటిదగ్గర ఆటో ఆగగానే ఆకలిగా ఉంది అంటూ స్వప్న వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య డబ్బులు ఇస్తుంటే.. కళ్యాణ్ కర్చీఫ్ కిందకి తీసుకోబోతు వదిన ఆశీర్వాదం తీసుకుంటాడు. కావ్య డబ్బులు ఇస్తూ.. మేం చెప్పకుండా, మీరు అడగకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారని కావ్య అంటుంది. కళ్యాణ్ కవితలు తనకే చెప్తుంది. దాంతో కళ్యాణ్ కర్చీఫ్ తీస్తాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది.. మొదటి అడుగు వేసావంటూ కళ్యాణ్ కి దైర్యం చెప్తుంది కావ్య. తరువాయి భాగంలో పోలీసులు దుగ్గిరాల ఇంటికి వస్తారు. దారిలో అక్రమ గోల్డ్ ట్రాలీని పట్టుకున్నాం. అది మీ స్వరాజ్ గ్రూప్ కి సంబంధించిందని తెలిసింది. అందుకే రాజ్ గారిని అరెస్ట్ చెయ్యడనికి వచ్చామని పోలీసులు అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read